విద్యార్థులు మత్తు పదార్థాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

విద్యార్థులు మత్తు పదార్థాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

– కాళేశ్వరం ఎస్సై చక్రపాణి

కాలేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణ పై కాళేశ్వరం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాళేశ్వరం ఎస్సై చక్రపాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చక్రపాణి మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, గుట్కా,మత్తు పదార్థాల వంటివి సేవించడం వలన కలిగే అనర్థాలపై వివరించారు. ప్రజలను విద్యార్థులే ముం దుండి చైతన్య పరచాలని అన్నారు‌. డ్రగ్స్ గంజాయి సేవిం చిన విక్రయించిన కేసులు నమోదు చేస్తామని ఎస్సై చక్రపాణి హెచ్చరించారు.విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని చదవాలని ఎస్ఐ సూచించారు..ఈ కార్యక్రమంలో హెచ్ఎం అన్నపూర్ణ, ఉపాధ్యాయులు,పోలీసు సిబ్బంది,విద్యార్థులు ఉన్నారు.