రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

Written by telangana jyothi

Published on:

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

– ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కు తప్పనిసరి

– ప్రతీ స్కూల్ బస్ ఫిట్నెస్ ఉండాలి 

– ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని. 

భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని అన్నారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో విద్యార్థులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించే అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సందాని మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు నడిపితే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా టాటా మ్యాజిక్ లో, ఆటో లల్లో విద్యార్థుల తరలింపునకై ప్రోత్సహించొద్దని పేర్కొన్నారు. కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లనే విధుల్లో చేర్చుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్, స్కూల్ బస్సు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించే లేదని ఆయన స్పష్టం చేశారు. స్కూల్ బస్సులకు ఏలాంటి ప్రమాదాలు జరిగినా డ్రైవర్, సంబంధిత యాజమాన్యంపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాల యజమానులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment