సోషల్ మీడియాలో పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు
– అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియా అడ్మిన్లదే బాధ్యత
ములుగు, తెలంగాణ జ్యోతి : పదవ తరగతి పరీక్షల సంరద్భంగా సోషల్ మీడియాలో పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ మేకల రంజిత్ కుమార్ హెచ్చరిం చారు. ములుగులోని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేయొద్దన్నారు. ములుగులో పదవ తరగతి పరీక్షల విషయంలో పుకార్లు సృష్టించిన వెంకటాపూర్ కు చెందిన కుమ్మరి సాగర్ పై కేసు నమోదు చేశామన్నారు. వాట్సప్ గ్రూపుల్లో ఎవరైనా అసత్య ప్రచారాలను పోస్టులు చేసిన ఫార్వర్డ్ చేసినా గ్రూప్ అడ్మిన్లదే బాధ్యత అన్నారు. ఈ విషయాలను గ్రూప్ అడ్మిన్లు పరిగణలోకి తీసుకోవాలని సీఐ రంజిత్ సూచించారు.