నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
– ఫర్టిలైజర్ దుకానాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాటారం డిఎస్పి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్టు నమోదు చేస్తామని కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్, రైతు ఉత్పత్తి సంబంధిత దుకాణాలను ఆయన కాటారం ఎస్సై మ్యాక అభినవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణదారులకు పలు సూచన లు చేశారు. రైతులకు అమ్మిన సరుకు రసీదులు అందజేయా లని, నాణ్యత లోపం లేకుండా సేవలు అందించాలని సూచిం చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా దుకా ణదారులు సహకరించాలని కోరారు కల్తీ విక్రయాలు జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల వెంట వ్యవసాయ అధికారులు ఉన్నారు