కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Written by telangana jyothi

Published on:

కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

– యం జే యస్ నాయకులు సాంబశివరావు డిమాండ్.

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం కొప్పుసూరు గ్రామంలో కులం పేరుతో దూషిస్తూ నీచంగా దుర్భాషలాడుతూ, దళిత మహిళ లను అవమానించిన వారిపై పోలీసు అధికారులు చట్టపరమై న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాదిగ జాగృతి సంఘం ములుగు జిల్లా నాయకులు సాంబశివరావు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోగల కొప్పుసూరు గ్రామంలో దళిత వర్గానికి చెందిన నేతకాని కులస్తులను కులం పేరుతో అవమానించారని  తమకు అండగా నిలవాలని కుల పెద్దల ఆహ్వానం మేరకు బుధవారం సాయంత్రం కొప్పుసూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం,  ములుగు జిల్లా అధ్యక్షులు కొండగొర్ల రాజేష్, మాదిగ జాగృతి సంగం జిల్లా నాయకులు సాంబశివరావు హాజరైనారు. ఈ సమావేశంలో నేతకాని కుల పెద్దలు మాట్లాడుతూ తమ కోప్పుసూరు గ్రామానికి చెందిన ఎస్. కే .ఖదీర్ అను వ్యక్తి తమ కులంలో గల దళిత స్త్రీ నీ లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా, ప్రశ్నించిన పాపానికి ఎస్.కె వలి పాషా అతని భార్య నోటికి వచ్చినట్లు కులం పేరుతో దూషిస్తూ, చెప్పరాని మాటలతో దుర్భాషలాడారని, భాదితులు తమ గోడును విన్నవించారు. అనంతరం కొండగొర్ల రాజేష్, సాంబ శివరావు మాట్లాడుతూ సదరు బాధిత దళితులకు అండగా ఉంటామని, చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు దశల వారి ఆందోళనలు నిర్వహిస్తామని, హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలో దళిత బహుజనులకు ఉన్న హక్కులను పాటించవలసిన విధులను తెలియపరిచారు. భారత రాజ్యాంగం అమలులో ఉన్నప్పటికీ,ప్రజా స్వామ్యం లో ఉండికూడా దళితుల మానప్రాణాలకు భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా పోలీసు అధికారులు,వాజేడు పి.ఎస్ అదికారులు వెంటనే స్పందించి జరిగిన ఘటనపై విచారణ జరిపి, ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, దళితులకు రక్షణ కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కేసును పోలీసు అధికారులు నీరుగార్చి నట్లయితే, ప్రజా సంఘాల వేదికగా ఆందోళనలు చేపడతా మని, ఎస్సీ ,ఎస్టీ కమిష న్ వరకు విషయాన్ని తీసుకెళ్లి, బాధిత దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల దళిత పెద్దలు జాడి రాజు, ఎష్కరి ముత్తయ్య, కుమ్మరి బాబు, కుమ్మరి రమేష్ తదిత రులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now