గట్టమ్మను దర్శించుకున్న ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Written by telangana jyothi

Published on:

గట్టమ్మను దర్శించుకున్న ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ములుగు , తెలంగాణ జ్యోతి : మేడారం వెళ్తున్న భక్తులకు మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ తల్లి అని తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు అన్నారు . శనివారం ములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లి దేవాలయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్ , తెలంగాణ ఎరుకల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య ,ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు భూనాద్రి రంజిత్ ,వరంగల్ పందుల సొసైటీ అధ్యక్షులు ఓని సదానందం, వరంగల్ జిల్లా గౌరవాధ్యక్షులు పల్లకొoడ ప్రభాకర్ , టి వై ఎస్ వరంగల్ మండల అధ్యక్షులు పాలకుర్తి నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now