నూతన ఎంఈఓగా బాధ్యతలను స్వీకరించిన శ్రీనివాస్ రావు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: ఎన్నో ఏళ్లుగా ఇన్ఛార్జి లతో నడుస్తుండడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతుందని, దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీనియారిటీ ప్రతిపాదనతో కొత్త ఎంఈఓలను నియమించింది. ఈక్రమంలో కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ముప్పనపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.శ్రీనివాస రావు సోమవారం ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపనమ్మకాన్ని తొలగించి విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలో విద్యారంగంలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తాననిన్నారు, ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలని తెలియ జేశారు. ఈ నేపథ్యంలో నూతన విద్యాశాఖ అధికారి పలువురు ఉపాద్యాయులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.