మండల విద్యాధికారిగా శ్రీదేవి బాధ్యతల స్వీకరణ 

మండల విద్యాధికారిగా శ్రీదేవి బాధ్యతల స్వీకరణ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై పూర్తిస్థాయిలో మండల విద్యా శాఖ అధికారులను నియామకాలు చేపట్టింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మండల విద్యాధికారిగా ఐ.శ్రీదేవి నియమితులయ్యారు. కాగా శుక్రవారం శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఎంఈఓ శ్రీదేవిని కలిసి మండల పిఆర్టియు టీఎస్ ఉపాధ్యా యులు శాలువాతో సత్కరించి, పూల బొకే అందిం చి శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షు లు ఏ రవీందర్, ప్రధాన కార్యదర్శి అనపర్తి తిరుపతి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎన్ సురేష్ రావు, జిల్లా ఉపాధ్య క్షులు పి శ్రీనివాస్ రెడ్డి, భగవాన్ రెడ్డి, కాటారం కాంప్లెక్స్ ప్రధా నోపాధ్యాయురాలు ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment