అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి  కళ్యాణం. 

Written by telangana jyothi

Published on:

అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి  కళ్యాణం. 

– తరలివచ్చిన అశేష భక్త జనం. 

– భక్తులతో కిటకిలాడిన బెస్తగూడెం ఇష్టపురి స్వామివారి ఆలయం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్త గూడెం ఇష్టపురి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఏకదంతా వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగ రంగ వైభవంగా వీనుల విందుగా, నేత్రపర్వంగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. శ్రీ ఉమామహేశ్వర పురస్పర సిద్ధి లక్ష్మీ సహిత పంచాయితన ఏకదంతా వరసిద్ధి వినాయక స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం, మరియు కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి, స్వామివారి తీర్థ ప్రసాదా లను స్వీకరించేందుకు, అనేక గ్రామాల నుండి ,వెంకటాపురం మండల కేంద్రం నుండి వందల సంఖ్యలో ఇష్టపురి స్వామివారి దేవాలయానికి తరలిరాగా, దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య నిర్వహిం చేందుకు, ప్రత్యేక పండితులను పూజారులను, బ్రాహ్మణోత్తములను ఆలయ కమిటీ కల్యాణ మహోత్సవానికి వేరే ప్రాంతాల నుండి ఆహ్వానించి వారి చేతులు మీదుగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ, మండపారాధన, కలశపూజ, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీపతి హోమం, రుద్ర హోమం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పండితుల ముహూర్తం బలం ప్రకారం సోమవారం ఉదయం 11:15 గంటలకు శ్రీ సిద్ధి ,బుద్ధి సమేత వినాయక స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అశేష భక్తజనం జై గణేశా, జై జై గణేశా, జై విగ్నేశ్వర, జై ఏకదంతా పరమేశ్వర పుత్ర అనే నామస్మరణలతో స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో మారుమోగింది. అధిక శాతం మహిళా భక్త సోదరీమణులు , భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. మంగళతూర్య వాయిద్య ములతో, భక్తుల జయ, జయ ద్వానాలతో పేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశేష భక్త జనానికి వేద పండితులు స్వామివారి కల్యాణ మహోత్సవం ముగిసిన వెంటనే భక్తులకు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్ద ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమాన్ని భక్తులకు నిర్వహించారు. అన్నప్రసాద దాన కార్యక్రమంలో వందలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద స్వామివారి భక్తురస కార్యక్రమంతో బెస్తగూడెం ఇష్టపురి దేవాలయం లో భక్తి రస సౌందర్యం సంతరించుకుంది. గ్రామం యావత్తు కళ్యాణ మహోత్సవానికి తరలిరావడంతో, సందడి ఏర్పడింది. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని, పాడి ,పంటలు సక్రమంగా పండాలని అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని, ఈ సందర్భంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి కణ్యాల మహోత్సవం సందర్భంగా భక్తులు స్వామివారిని వేడుకున్నారు. స్వామి వారి కళ్యాణం మహోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆలయం నూతన శోభను సంతరించుకున్న ది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now