రావి ఆకులపై శ్రీ రాముని సీతమ్మ వార్ల చిత్రలేఖనం
విద్యార్థుల ప్రతిభ ను అభినందించిన ప్రిన్సిపాల్
వరంగల్, తెలంగాణ జ్యోతి : శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర బదిరుల పాఠశాల, వంరగల్ లో చదువుతున్న విద్యార్థులు ఎం.భార్గవి, జె. అరంవిద్ 9 వ. తరగతి విద్యార్థులు రావి ఆకులు పై శ్రీ రాముడు, సీతమ్మ వారిని చిత్రలేఖనం గీయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభ కలవరచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ జె. లక్ష్మి నర్సమ్మ , డ్రాయింగ్ మాస్టర్ డాక్టర్ ఎ. యాకయ్య ని మరియు విద్యార్థులు ను టిచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పి. చరణ్ సింగ్ తదితరులు అభినందనలు తెలిపారు.