అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

– గ్రామ, గ్రామాన శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాలు

– తరలివచ్చిన భక్తజనం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా  వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిగింది. శ్రీ సీతారాముల మందిరాలతో పాటు అనేక గ్రామాల్లో శ్రీ ఆంజనేయ స్వామి మందిరాల వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువజామునుండే వెంకటాపురం మండల కేంద్రంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అలాగే వెంకటాపురం మండల కేంద్రంలోని రెవెన్యూ క్వాటర్స్, హై స్కూల్ వద్ద, అప్పాల వారి వీధితో పాటు, బెస్త గూడెం గ్రామంలోని శ్రీరామ టెంపుల్ తో పాటు, వాజేడు మండలంలోని గ్రామాలలో శ్రీ ఆంజనేయ స్వామి మందిరాలు, శ్రీ రామ మందిర్ లలొ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయా కమిటీ ల వారు భక్తులకు బెల్లం పానకం, వడపప్పు, పులిహార ప్రసాదాలను పంపిణీ చేశారు.ఆయూ ఆలయ కమిటీ వారు భక్తులకు ఈ సందర్భంగా కళ్యాణం అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని గ్రామ, గ్రామాన నిర్వహించారు. తిరు మహోత్సవాలకు  భక్తులు అధిక సంఖ్య లో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అలాగే భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవాలకు ఈ ప్రాంతం నుండి వందల సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. శ్రీరామనవమి సందర్భంగా మిరప పండ్ల కోతలు, వ్యవసాయ పనులు ఆదివారం నిలిపివేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment