అంగరంగ వైభవంగా శ్రీ కార్తీక జ్యోతీర్ మహోత్సవం
– 10 వేల 402 దీపాలు వెలిగించిన భక్తులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మంగపేట రోడ్డు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద సోమవారం రాత్రి శ్రీ కార్తిక్ జ్యోతి ర్ మహోత్సవం సందర్భంగా 10వేల 402 దీపాలు వెలిగించి కార్తీకదీపం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో సోదరీమణులు, భక్తురాళ్ళు కార్తీక దీ పోత్స వంలో పాల్గొని, దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు నిర్వహించారు. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండాలని, అందరు బాగుండాలనీ అందులో మన మందరం ఉండాలని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి మందిరం ముందు అంజన్న స్వామి మాల ధారణ భక్తులు, భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండి తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి పంజామృత అభి షేకం, సహస్రనామ ధలార్చనలతో,సింధూరంతో పూజ, నాగ వల్లి దళార్చన, మరియు విరాజనం మంత్రపుష్పములు తొ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌక ర్యార్థం ఆలయ కమిటీ విస్తృతమైన ఏర్పాట్లు నిర్వహించిం ది. స్వామివారి సేవలో ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ, భక్తులు శ్రీ అభ య ఆంజనేయ స్వామి వారికి భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్నారు. శ్రీకార్తిక్జ్యోతిర్మహోత్సవం సందర్భంగా 10 వేల 402 దీపాలు వెలిగించడంతో వెంకటాపురంలో, భక్తిరస దీపోత్సవంతో నూతన శోభను సంతరించుకున్నది. కార్తీకదీ పోత్సవం సందర్భంగా మంగపేట రోడ్డు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది.శ్రీ అంజన్న స్వాముల మాలధారణ భక్తులు, మహిళా సోదరీ మణులు, దీపాలు వెలిగించే కార్యక్రమాలలో పాల్గొనడంతో భక్తి రస సందడి నెలకొన్నది. భక్తులకు స్వామి భక్త మండలి ప్రసాదాలను పంపిణీ చేశారు.