ప్రజాపాలన గ్రామసభలకు విశేష స్పందన.
– అడిషనల్ కలెక్టర్, ములుగు జిల్లా ఎస్పీ కేంద్రాల సందర్శన.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం లో ప్రజా పాలన అభయ హస్తం గ్రామ సభలకు మరియు మండలం లో విశేష స్ఫంధన నెలకొంది. దరఖాస్తులు ఇచ్చేందుకు వ్యవసాయ పనులు మాను కొని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. గురు వారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటిల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పెద్ద గొల్ల గూడెం లో ప్రారంభించగా, గ్రామ సర్పంచ్ జజ్జరి మేనక అధ్యక్షత వహించారు. ఎంపిఓ శ్రీకాంత్ నాయుడు టీం అధ్వర్యంలో జరిగింది .ఈ కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) వేణుగోపాలరావు, ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం,ఏటూరునాగారం ఎఎస్పీ శిరిశెట్టీ సంకీర్తి సందర్శించారు. ప్రజా పాలన లో గ్రామస్తుల నుండి అభయ హస్తం దరఖాస్తులును అదికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివి ధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలన కార్యక్రమం లో పి కోటేశ్వరరావు కార్యదర్శి, వాజేడు ఎస్.ఐ. వెంకటేశ్వరరావు , పి నగేష్ అదికారులు ఎ రాజేందర్, ,సిఎచ్ ప్రసాద్, సిఎచ్ మల్లయ్య, ఎండీ లతీఫ్, షరీఫ్,రాధిక గౌడ్ శ్రావంతి, పి. సత్యనారాయణ , డి వెంకట రామనర్సయ్య,ఎ సమ్మయ్య , ఎం దుర్గలక్ష్మి , రాంబాబు, స్వరూప, అంగన్వాడీ, ఆశా వర్కర్లు నాగకుశల, కుసుమ,రంభ, పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదతరులు పాల్గొన్నారు.
1 thought on “ప్రజాపాలన గ్రామసభలకు విశేష స్పందన. ”