ములుగులో దుర్గామాతకు ప్రత్యేక పూజలు : సీతక్క
ములుగు ప్రతినిధి : ములుగు లోని రామాలయం ఆవరణ లో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం దర్శించు కున్నారు. రెండవ రోజు గాయత్రీ దేవి అవతారంలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు సముద్రాల శ్రీనివాసచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచ నాలు అందజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క వేడుకున్నారు. ఈ కార్యక్ర మంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి వాసుదేవ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొత్త సురేందర్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బానోతు రవి చందర్, చింతనిప్పుల బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.