లక్ష్మీదేవిపేటలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద దుర్గం వంశీయుల ప్రత్యేక పూజలు

లక్ష్మీదేవిపేటలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద దుర్గం వంశీయుల ప్రత్యేక పూజలు

లక్ష్మీదేవిపేటలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద దుర్గం వంశీయుల ప్రత్యేక పూజలు

వెంకటాపూర్, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట లోని సమ్మక్క సారలమ్మ తల్లులుకు  దుర్గం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువా రం దుర్గం వంశీయులకు వారి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారంగా అమ్మవార్లకు ఎంతో ఇష్టమైన మాఘ శుద్ధ పౌర్ణమి పండగను పురస్కరించుకొని, సమ్మక్క సారలమ్మ  ప్రధాన పూజారులు దుర్గం సంపత్, డాక్టర్ దుర్గం సూరయ్యల ఆధ్వర్యంలో అమ్మ వార్లకు పూజలు నిర్వహించి బంగారం, ఒడి బియ్యం, పసుపు కుంకుమ,పోకలు, కుడుకలు, గాజులుచీరేరే సారే లతో మొక్కులు సమర్పించారు. గ్రామంలోని మహిళలు సమ్మక్క సారలమ్మ భక్తులందరూ పాల్గొని కోరిన కోరికలను తీర్చి, పంటలు బాగా పండేలా, అందరూ బాగుండాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట, బూరుగుపేట, తదితర గ్రామాల భక్తులు  మొక్కులు చెల్లించుకున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “లక్ష్మీదేవిపేటలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద దుర్గం వంశీయుల ప్రత్యేక పూజలు”

Leave a comment