పాడి పంటలు బాగ పండాలని పాత్రాపురంలో ప్రత్యేక పూజలు.

Written by telangana jyothi

Published on:

పాడి పంటలు బాగ పండాలని పాత్రాపురంలో ప్రత్యేక పూజలు. 

– తరలివచ్చిన వాడబలిజ రైతు కుటుంభాలు. 

వెంకటాపురం నూగూరు,తెలంగాణ జ్యోతి : పాడిపంటలు సక్రమంగా పండాలని, సకల జనులు సుఖశాంతులతో ఉం డాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తొలకరి వర్షాల ప్రారంభంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రా పురం గ్రామంలో వాడ బలిజ సంఘం, వాడ బలిజ రైతు కుటుంబాలతో కలిసి ఆదివారం ఊరి పొలిమేరల్లో ఉన్న గ్రామ దేవతలకు ఆనవాయితీగా ప్రత్యేక పూజలు నిర్వహిస్టారు. ఈ సందర్భంగా తమ ఇల్లు వాకిళ్లను శుభ్రం చేసుకుని పసుపు కుంకాలతో ,సాంబ్రాణి,ధూప ,ధీప నైవేద్యా లతో సన్నాయి డప్పు వాయిద్యాల మధ్య మేకపోతు లను, కోడిపుంజులను ఊరేగింపుగా, సంబరాలతో గ్రామ దేవతల వద్దకు వెళ్లి పసుపు, కుంకాలతో పూజలు నిర్వహించారు.అనంతరం మొక్కుబడులుచెల్లించుకున్నారు. ఈ సందర్భం గా వాడ బలిజ రైతులు,వారి కుటుంభాలు వారి ఆబాల గోపాలం గ్రామ దేవతల పూజల్లో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. వ్యవసాయ పాడిపంటల గ్రామమైన పాత్రా పురంలో తొలకరి వర్షాల పాడి పంటల ప్రత్యేక పూజలు, గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పించే కార్యక్ర మం సందర్భంగా పాత్రా పురం గ్రామంలో సందడి నెలకొన్నది.

Leave a comment