సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

– ప్రతీరోజు సానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలి: డీపీవో దేవరాజ్

ములుగు ప్రతినిధి : భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ఆయా గ్రామాల్లో సానిటేసన్ డ్రైవ్ నిర్వహిస్తూ దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ సూచించారు. రాష్ర్ట మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశా మేరకు పంచాతీ కార్య దర్శులు, ప్రత్యేక అధికారులు, ఎంపీవోలు, ఎంపీడీఓలకు సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ అంటురోగాలు వ్యాప్తి చెందకుండా సానిటేషన్ పనులు చేపట్టాలని, దోమల నివారణ మందులు పిచికారీ చేయాలన్నారు. అదేవిధంగా జీపీల శివారు ప్రాంతాల్లో స్థానిక వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తో సమన్వయంగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఉన్న వారిని షిఫ్ట్ చేయాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చెరువులు, వాగులు, గోదావరి వద్ద చేపల వేటను నిషేదిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, చాటింపు నిర్వహించాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని విజ్క్షప్తి చేశారు. డ్రైనేజీల్లో పంచాయతీ సిబ్బంది క్లీనింగ్ కార్యక్రమం చేపట్టాలని, మేజర్ జీపీల్లో అవసరమైన సిబ్బందిని పెంచుకోవాలని ఆదేశిం చారు. జీపీల పరిధిలో ప్రతీరోజు కనీసం 50 ఇండ్లలో స్పెషల్ శానిటేషన్ పూర్తి చేయాలన్నారు. జీపీల్లో అవసరమైన బ్లీచింగ్, సున్నం, ఫాగింగ్ మెషీన్లు, మలాథియన్, బయోటెక్స్, హ్యాండ్ స్ప్రే మిషన్ లు, తదితర పారిశుద్ధ్య మెటీరియల్, కెమికల్స్ అందుబాటులో ఉండేలా చూసుకోగలని సూచించా రు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను వారానికి ఒకసారి తప్పని సరిగా శుభ్రపరచాలన్నారు. గ్రామాల్లో ఉన్న హోటల్స్, చికెన్, మటన్ సెంటర్ ల వద్ద పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వస్తువులను సేకరించాలని, పరిశుభ్రత పాటించని వారికి పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకార జరిమానా విధిస్తామని డీపీవో దేవరాజ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.