కాటారంలో వాహనాల పెండింగ్ చాలన్లపై స్పెషల్ డ్రైవ్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రోడ్డు రవాణా నిబంధనలను అతిక్రమించిన వాహనాలకు విధించిన చాలాన్లు పెండింగ్ లో ఉన్న వాటిని చెల్లింపులు చేయుటకై పోలీసులు బుధవారం రాత్రి కాటారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కాటారం ఎస్ ఐ అభినవ్ ఆధ్వర్యంలో పెండింగ్ చాలాన్ల చెల్లిం పులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు నిర్వహించిన పెండింగ్ చాలాన్ల చెల్లింపులలో భాగంగా 41 వాహనాల నుంచి 21 500 రూపాయలను జమ చేసినట్లు ఎస్ఐ అభినవ్ తెలిపారు. పెండింగ్ చాలాన్లు సక్రమం గా సత్వరమే చెల్లింపులు చేయాలని, లేనియెడల అట్టి వాహనా లను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.