వెంకటాపురం నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు. 

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు. 

– ప్రారంభమైన బస్సు సర్వీసులు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మేడారం మహా జాతరకు సత్తుపల్లి డిపోకు చెందిన టిఎస్ఆర్టిసి బస్సులను ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. వెంకటాపురం బస్ స్టేషన్ నుండి 11 బస్సులు చర్ల నుండి పది బస్సులు వంతున సత్తుపల్లి డిపోకు చెందిన స్పెషల్ బస్సులు, డిపో అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా బస్సులు సిబ్బంది, మేడారం యాత్రికులు ,భక్తులు సౌకర్యార్థం, బస్సులను వెంకటాపురం స్టేషన్ పాయింట్లు నిలిపి, మైకు ద్వారా ప్రత్యేక బస్సులకు భక్తులను ఆహ్వానిస్తున్నారు. వెంకటాపురం నుండి మేడారం మహా జాతర గద్దెల వరకు బస్సులో ప్రయాణించి, అమ్మవార్ల దర్శించుకునే అవకాశం ఉందని, దీంతో భక్తులు ప్రత్యేక బస్సులు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఆర్టీసీ అధికారులు కోరారు. పెద్దలకు పురుషులకు 150 రూపాయలు, పిల్లలకు 80 రూపాయలు వంతున ఆర్టీసీ చార్జీలను వసూలు చేస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వుంది. బయలుదేరే పాయింట్ల నుండి బస్సు నిండకపోయినా మద్య మార్గంలో కూడా మేడారం వెళ్లే భక్తులను ఎక్కించుకునే సౌలభ్యం కోసం, మేడారం మహా జాతర ప్రత్యేక బస్సులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ మేరకు బస్సులకు మార్గమధ్యలో ఏమైనా రిపేర్లు వస్తే ఆర్టీసీ మెకానిక్ విభాగం మరియు అదనపు బస్సులు, మరమ్మతులు గురైన వెంటనే సెల్ఫోన్ ద్వారా సమాచారంతో వెంటనే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా మేడారం గద్దెల వరకు దించేందుకు ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు సిబ్బంది విధులు నిర్వహిస్తు న్నారు. ఈనెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేడారం ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయని, చుట్టుపక్కల గ్రామాలు చెందిన మేడారం వెళ్లే భక్తులు ప్రైవేటు వాహనాలు ఎక్కకుండా, ప్రభుత్వ పరమైన ఆర్టీసీ బస్సులెక్కి గద్దెల వరకు ప్రయాణించి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకొని తిరిగి అవే బస్సులలో సురక్షితంగా వారి, వారి స్వగ్రామాలకు చేరుకునే విధంగా టిఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సత్తుపల్లి డిపోకు చెందిన సిబ్బంది, సూపర్వైజర్లు వెంకటాపురం లో విధుల్లో హాజరయ్యారు. అలాగే ఎస్. పి.ఎల్. డిపోకు చెందిన సూపర్వైజర్లు సాగర్, ప్రొడ్యూస్ లు సిబ్బంది యొక్క విధులు, వారి బాధ్యతలను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు మేడారం భక్తులకు సేవలు అందించేందుకు ,సిబ్బంది రేఇంబవళ్ళు వారికి కేటాయించిన సమయాల్లో డ్యూటీలో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు రావడంతో, వారంతా సిద్ధంగా ఉన్నారు. వారికి సౌకర్యాలు కల్పించేందుకు వెంకటాపురం మండల అధికారులు, మరి యు ప్రజాప్రతినిధులు ,మండల రెవెన్యూ కార్యాలయం సమీపంలోని గిరిజన ప్రభుత్వ బాలుర వసతిగృహం భవనా న్ని కేటాయించారు. ఈ మేరకు సత్తుపల్లి ప్రత్యేక డిపో బస్సుల సిబ్బంది మైకు ద్వారా మేడారం ప్రయాణికులను, భక్తులు ను ఆహ్వానిస్తున్నారు. మేడారం మహా జాతర కు లక్షలాది మంది ప్రజలు భక్తులు మేడారం చేరుకుంటుం డడంతో వెంకటాపురంలో ప్రత్యేక బస్సులతో, ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, స్ఫెషల్ బస్సులలో మేడారం వెళ్ళేందు కు జై శ్రీ సమ్మక్క, సారలమ్మ తల్లి, జై జై సమ్మక్క సారలమ్మ తల్లి అంటూ మొక్కులు చెల్లించు కొనేందుకు, చలో మేడారం అంటూ గ్రామాలకు గ్రామాలు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలువురు భక్తులు తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now