విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన ఎస్పీ శబరీష్​

విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన ఎస్పీ శబరీష్​

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పునర్ నిర్మించబడిన నూతన విశ్రాంతి భవనాన్ని జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. జిల్లా పోలీస్ అధికారులకు, ఇతర జిల్లాల నుంచి వచ్చే అధికారులకు సరిపడా విశ్రాంతి గదులు లేనందున, ముఖ్యంగా మేడారం జాతర, ఇతర ముఖ్య సమావేశాల సమయంలో అధికారుల కు సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతు న్నారని, ఈవిషయాన్ని గమనించి నూతన గెస్ట్ గదులను నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ రాములు, ములుగు సీఐ శంకర్, పస్రా సీఐ రవీందర్, ఏటూరునాగారం సిఐ శ్రీనివాస్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సంతోష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ వెంకట నారాయణ, ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు, ఎస్సై కమలాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్, మంగపేట ఎస్సై టివిఆర్ సూరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.