ఘనంగా సోనియగాంధీ జన్మదిన వేడుకలు
ఘనంగా సోనియగాంధీ జన్మదిన వేడుకలు
కాటారం, తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ ప్రధాత, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాటారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గారెపల్లి అంబేద్కర్ కూడలిలో టపాసులు కాల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షాలను, మిత్రపక్షాలను ఒప్పించి తెలంగాణ అమరుల త్యాగాన్ని బలిదానాల్ని చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్, మహిళ మండల అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, ఓ బి సి మండల అధ్యక్షుడు కొట్టే ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి చీమల రాజు, కొట్టే శ్రీహరి, మాజీ సర్పంచులు అంగజాల అశోక్ కుమార్, రఘురాం నాయక్, కడారి విక్రమ్, గద్దల రమేష్, శకుంతల, మంత్రి నరేష్, ఆత్మకూరి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.