ఆదివాసి సమస్యల ను పరిష్కరించండి

ఆదివాసి సమస్యల ను పరిష్కరించండి

– పీ.ఓ. కు ఆదివాసి సంక్షేమ పరిషత్ వినతి పత్రం

వెంకటాపురంనూగూరు, తెలంగాణ జ్యోతి: 5వ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం, పిసా అమల్లో ఉండగా, గృహ నిర్మా ణ లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు చట్ట విరుద్ధం అని ఆదివాసి సంక్షేమ పరిషత్తు ములుగు జిల్లా కన్వీనర్ సతీష్ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన ఇందిరమ్మ కమిటీ లు మళ్లీ తెరపైకి వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల ద్వారా ఆదివాసులకు నిరుపేదలకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన జీ. ఒ నెం. 33 వెంట నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా అనేక ఆదివా సీల సమస్యలపై మంగళవారం ఏటూరునాగారం ఐ.టి.డి.ఏ .పి.ఓ.కు సంఘం తరుపున వినతి అందజేశారు. షెడ్యూల్ ప్రాంతాలను నిర్వీర్యం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యః గా తీసుకుందని వారు నిలదీశారు. ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత చట్టాలను, ఆదివాసులకు ఉన్నటు వంటి సర్వహక్కులను కాపాడే ప్రత్యేక కమిషన్ ను నియమించాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు బోదెబోయిన సురేష్, క సోడి గోపి, మీడియం ముత్తయ్య, మడకం నాగమ్మ, కుర్సం సమ్మక్క, బడిష కన్నయ్య, కురుస ముత్తయ్య, తాటి సుమన్, తదిత రులు పాల్గొన్నారు.