ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో పాము కలకలం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం లోని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ ఆవరణలో శుక్రవారం ఉదయం భారి పాము కనప డటంతో వైద్యశాల సిబ్బంది, పేషెంట్లు హైరానా పడ్డారు. వైద్య శాల ఆవరణ పక్కన నిరుపయోగం ఉన్న వెంకటాపురం సబ్ జైల్ ఆవరణలో విపరీతంగా పిచ్చి చెట్లు పెరగడంతో పాము లు వైద్యశాల వైపు సంచరిస్తున్నాయి. గురువారం రాత్రి వైద్య శాల ప్రధాన గేటు ఇంటర్నల్ రోడ్డుపై విషపూరితమైన కట్లపామును గ్రామస్తులు చంపినట్లు వినికిడి. ప్రస్తుతం ఆవరణలో పూల మొక్కలతో గార్డెన్ ను పెంచుతున్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పూల మొక్కలపై సుమారు నాలుగు అడుగులు పైన పొడవు ఉన్న పాము కనపడింది. దీంతో దాన్ని వెళ్ళ గొట్టేందుకు ప్రయత్నం చేయగా పచ్చని చెట్ల మాటున పాము దాక్కొని కనపడకుండా పోయింది. తరచూ పాములు ఆవరణలో సంచరిస్తుండటం తో సిబ్బంది, వచ్చే పోయే రోగులు భయ భ్రాంతులకు గురవుతున్నారు.