యువకుడికి పాము కాటు – సకాలంలో వైద్యం

యువకుడికి పాము కాటు - సకాలంలో వైద్యం

యువకుడికి పాము కాటు – సకాలంలో వైద్యం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రా పురం గ్రామ ప్రాంతంలో పొలం పనులు చేసుకుంటున్న అల్లి రవీంద్ర అనే యువకుడిని పాము కాటు వేసింది. వెంటనే గమనించిన రవీంద్ర పక్కనే తనతోటి పనిచేస్తున్న వారికి తెలపడంతో అక్కడే గడ్డిలో నక్కీ ఉన్న పామును చంపివేశారు. పాముకాటు బాధితుడు రవీంద్రను హుటా హుటిన వెంకటాపురం ప్రభుత్వ వైద్యశా లకు తీసుకువచ్చారు. అలాగే చంపిన పాము ను కూడా డాక్ట ర్లకు చూపించారు. వెంటనే పాము కాటు విషం విరుగుడు వైద్యంఅందించగా యువకుడు ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు.