ఎస్ ఐ శ్రీరాముల శ్రీనివాస్ ది ముమ్మాటికీ కుల దురంకార హత్యే..?
– ఉత్తర తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పీక కిరణ్
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై మరణించడం చాలా బాధాకరం, వారి ఆత్మహత్యకు కారణమైన జితేందర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు వారి సిబ్బందిని కఠినంగా శిక్షించాలని, విధుల నుండి తొలగించాలని ఆదివారం కాటారంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఉత్తర తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని ఉత్తర తెలంగాణ మాల మహానాడు డిమాండ్ చేసింది. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలోనే ఇలాంటి కుల వివక్షత ఉండడం శోచనీయమన్నారు. అనునిత్యం అవమా నిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, విధులలో ఆటంకాలు చేస్తూ, చివరికి ఎస్ ఐ శ్రీనివాస్ ను ఒంటరిగా చేసి ఆత్మ హత్య చేసుకోవడానికి పురి గొలిపిన అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ కఠినంగా శిక్షించాలని పీక కిరణ్ డిమాండ్ చేశారు.