మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై  రెండుసార్లు అత్యాచారం

Written by telangana jyothi

Published on:

మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై  రెండుసార్లు అత్యాచారం

-తాను మంత్రి తాలూకా అని బెదిరించిన ఎస్సై భవాని సేన్

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయ పడ్డాడు.ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్ చేశాడు.తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే “బాబన్న (శ్రీధర్ బాబు) బావున్నాడా.. నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడు” అంటూ మాట్లాడేవాడు.ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజూ ఒక చికెన్ సెంటర్ నుండి పావుకిలో చికెన్ పంపాలని హుకుం జారీ చేశాడు.ఆటో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులను ఎవరి వదల్లేదు. 

గతంలోనూ ఇదే చెత్త రికార్డ్

ఈ ఎస్సై గతంలో పని చేసిన ఠాణాల్లో ఇలాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. కంపిటేటివ్ పరీక్షలకు బుక్స్ ఇస్తానని వో అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేయడం , ఆ అమ్మాయి మీడియా ముందుకు రావడంతో కీచక బాగోతం బయటపడి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి కీచక అధికారుల చేష్టలతో మహిళా కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాలంటే జంకుతు న్నారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా ఉండాలం టే ఇలాంటి అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురుపేరుచెప్పలేని మహిళా కానిస్టేబుల్ కోరుతున్నారు.

ఉద్యోగం నుంచి సస్పెండ్ 

ఎస్సై భవాని సేన్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ఐజి రంగనాథ్ ప్రకటించారు.

Leave a comment