శ్రీ దేవి నవరాత్రులు ఘనంగా ప్రారంభం.
శ్రీ దేవి నవరాత్రులు ఘనంగా ప్రారంభం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : విజయ దశమి దసరా పండుగ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ దేవి నవరాత్రుల మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగత్ జననీగా పేరుగాంచిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి విగ్రహాలను పట్టణ ప్రాంతాల నుండి కొనుగోలు చేసి అంగరంగ వైభవంగా ట్రాక్టర్లలో ఇతర వాహనాల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి, శ్రీ కనకదుర్గమ్మ దేవి నవరాత్రుల మండపాల వద్ద ఆదివారం ఉదయం ప్రతిష్ట చేశారు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య భక్తుల హర్ష ధ్వనాల మధ్య దైవభక్తితో శ్రీ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద పండితుల పూజలతో భక్తులు సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రం తో పాటు, ఇష్టపురి విజ్ఞేశ్వర స్వామి ఆలయం ,ఇంకా అనేక గ్రామాల్లో శ్రీదేవి నవరాత్రుల పూజా కార్యక్రమాలు ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నుండి అమ్మవారికి పూజాది కార్యక్రమాలతో పాటు , మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలతో నైవేద్యాలతో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.