మృత కుటుంబానికి చేయూతనిచ్చిన శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్
ములుగు, డిసెంబర్23, గవాక్షం ప్రతినిధి : మండల పరిధిలోని సర్వాపూర్ గ్రామ పంచాయతీ జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన ఈసం రాజబాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యు లు గుండెబోయిన రవిగౌడ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ను పరామ ర్శించి 50 కిలోలు బియ్యం అందించారు. ఈసందర్బం గా శ్రీ రామ కృష్ణ ట్రస్ట్ సభ్యులు గుండెబోయిన రవిగౌడ్ మాట్లాడుతు ఆపదలో అప్పన్న హస్తం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ అని అన్నారు. గత మూడు సంవత్సరాలనుండి జిల్లా లో ఇప్పటివరకు మూడు వేల మంది కి ట్రస్ట్ ద్వారా సహాయం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు గుండెబోయిన శ్రీహరి గౌడ్, అప్పాజీ ఐలయ్య, ఈక కుమార్, ఈక లక్షమయ్య, సర్వాపూర్ సర్పంచ్ దబ్బగట్ల జయ రవి, శోభన్, గుమ్మడి అశోక్, పాపయ్య, సారంగం, శ్రీకాంత్, లింగస్వామి, సాంబా శివారావు, తదితరులు పాల్గొన్నారు.
1 thought on “మృత కుటుంబానికి చేయూతనిచ్చిన శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్”