ఫర్టిలైజర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా శేఖర్
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండల ఫెర్టిలైజర్, సీడ్స్ అసోసి యేషన్ అధ్యక్షులుగా కవ్వాల చంద్రశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ఫెర్టిలైజర్, సీడ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా అల్లాడి చంద్రమౌళి, కొత్త రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల అజయ్ కుమార్, కార్యదర్శిగా తోట కోటీశ్వర్, దోమ భాస్కర్, కోశాధికారిగా బచ్చు ప్రభాకర్, ప్రచార కార్యదర్శిగా నిడిగొండ చెన్నకేశవ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.