కాలేశ్వరంలో శని త్రయోదశి పూజలు

కాలేశ్వరంలో శని త్రయోదశి పూజలు

కాలేశ్వరంలో శని త్రయోదశి పూజలు

కాటారం, తెలంగాణ జ్యోతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం లో శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ప్రధాన ఆలయ ఆవరణలో గల నవగ్రహాలకు శని త్రయోదశి పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జాతకరీత్యా నక్షత్రాల దోష నివారణ, ఆరోగ్య సమస్యలు తొలగేందుకు ప్రజలు శని త్రయోదశి రోజున పూజలు చేస్తుంటారు. కాలేశ్వరంలో కాల సర్ప దోష పూజలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకములు శని త్రయోదశి రోజున నవగ్రహాల పూజలు నిర్వహిస్తే సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఇక్కడ పూజలు నిర్వహి స్తున్నారు. నివారణ గోదావరి నది త్రివేణి సంగమ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి కాలేశ్వరం స్వామి దర్శించుకొని భక్తులు నవగ్రహ పూజలు చేశారు. శని త్రయోదశి సందర్భంగా శని త్రయోదశి పూజలు 311. కాలసర్ప దోష పూజలు 120 శ్రీ స్వామివారి అభిషేకములు 78 జరిగినట్లు దేవాలయానికి రూ 3,61,009 ఆదాయం సమకూరినట్లు దేవాదాయ శాఖ అధికా రులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment