పుష్కర భక్తులకు శ్రీపాద ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు

పుష్కర భక్తులకు శ్రీపాద ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు

పుష్కర భక్తులకు శ్రీపాద ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు

– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

– పుష్కరస్నానానికి ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యాలు

– భక్తులకు ఉచిత అన్నదానం, పులిహోర పొట్లాలు, మంచినీటి సౌకర్యం

కాటారం, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దక్షిణ కాశి కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో భాగంగా కీర్తిశేషులు మాజీ స్పీకర్ శ్రీపాదరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా వేల సంఖ్యలో పుష్కర భక్తులు భోజనం చేస్తూ భోజనానంతరం అన్నదాత సుఖీభవ అంటున్నారు. మహాదేవపూర్ మండలంలో పుష్కర భక్తుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. శ్రీధర్ బాబు ఆదేశాలతో మాజీ సర్పంచ్ తెప్పెన దేవేందర్ రెడ్డి సోదరుడు తిప్పన ప్రభాకర్ రెడ్డి ఇలా ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి పెళ్లి చౌరస్తాలో పుష్కర భక్తులకు పులిహోర పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. సువిద్య స్కూల్ సౌజన్యంతో ఆరేపల్లి చౌరస్తా చింతకానిక్ క్రాస్ రోడ్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు చల్లని నీరు త్రాగిస్తు న్నారు.సరస్వతి పుష్కర స్నానం ఆచరించడానికి రాష్ట్ర నలు మూలల నుండి వస్తున్న యాత్రికుల కోసం భోజన సదుపాయం కల్పించాలని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుదిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు శ్రీపాద ట్రస్ట్ ద్వారా స్థానిక కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో “మహా అన్నదాన కార్యక్రమం” వస్తున్నట్లు కాటారం మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంథని నియోజకవర్గంలో ప్రతి గ్రామము నుండి పుష్కర స్నానం చేసి పుణ్యఫలం పొందేందుకు మంత్రి శ్రీధర్ బాబు ఉచిత వాహన సౌకర్యం కల్పిస్తున్నారు గత ఐదు రోజులుగా ప్రతి గ్రామం నుండి శ్రీధర్ బాబు ఏర్పాటు చేసిన బస్సులలో ఆచరిస్తున్నారు. మంత్రి వర్ధిల్లా శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ విజ్ఞాన్ కార్యక్రమంలోని ప్రజలకు శ్రీ సరస్వతి పుష్కరాల ప్రసాదం ను పంపిణీ చేస్తున్నారు. ఒక సంచిలో పుష్కర జలం కలిగిన నేటి సీసా,మహదేవుడి విభూతి సరస్వతీ మాత ఫోటో, ముక్తేశ్వర స్వామి లడ్డు ప్రసాదం, శుభానంద దేవి కుంకుమ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ పాద ట్రస్టు ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలు సేవా కార్యక్రమాలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment