అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీతక్క
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ రడం సుజాత మృతి బాధాకరమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మృతి చెందిన అంగన్వాడీ టీచర్ రడం సుజాత కుటుంబ సభ్యులను పరమార్శించారు. అనంతరం రూ. 20వేల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. సుజాతకు రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా ఇచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.