Seetalka | సీతక్క మంత్రి, డిప్యూటీ సీఎం కావాలని హనుమాన్ కు మొక్కిన బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు
– హనుమాన్ టెంపుల్ దగ్గర తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్న ఉట్నూర్ సదానందం
వెంకటాపూర్, డిసెంబర్05, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ముఖ్యంగా మన ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్క భారీ మెజార్టీతో గెలిచి మంత్రి, డిప్యూటీ సీఎం కావాలని హనుమాన్ దేవున్ని కోరుకు న్నాడు. అది నెరవేరుతున్నందున నేడు వెంకటాపూర్ మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ములుగు జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఉట్నూరు సదానందం తన గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర తలనీలాలు సమర్పించారు. తను కోరిన కోరిక తీర్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నాడు.
1 thought on “Seetalka | సీతక్క మంత్రి, డిప్యూటీ సీఎం కావాలని హనుమాన్ కు మొక్కిన బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు”