మేడారం పరిసర ప్రాంతాలలో రెండోసారి భూ ప్రకంపనలు.
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మేడారం పరిసర ప్రాంతాలలో రెండోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మొదటిసారి వచ్చిన భూ కంపంతో అడవి ప్రాంతంలో సెప్టెంబర్ 4న లక్షలాది చెట్లు నేల కొరిగాయి.మళ్లీ రెండోసారి మంగళవారం ఉదయం వచ్చి న భూ ప్రకంపనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయ భ్రాంతులకు ప్రజానీకం గురవుతుంది.
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..!
💥 ములుగు జిల్లా మేడారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాలలో ఈ భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావ డం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కల కలం సృష్టించగా, ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.