మైనారిటీ పాఠశాలలో సైన్స్ డే సంబరాలు.

Written by telangana jyothi

Published on:

మైనారిటీ పాఠశాలలో సైన్స్ డే సంబరాలు.

ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని దేవగిరిపట్నం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం వైభవంగా సైన్స్ డే సంబరాలను విద్యార్థులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు, మోడల్స్ లను రూపొందించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులలో బాల్యం నుండే సైన్స్ పరిశోధన పట్ల ఆసక్తిని పెంచితే భవిష్యత్తులో వారు ఎంతో సాధించ గలుగుతారన్నారు. అనంతరం సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now