గంగారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ బాటిల్స్ పంపిణి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: పాఠశాల విద్యార్థు లకు తమకు తోచిన విధంగా సహాయం అందజేయాలని ఒ తాజా మాజీ సర్పంచ్ సంకల్పించారు.జయశంకర్ భూపాలప ల్లి జిల్లా కాటారం మండలం గంగారం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, షూస్, మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు గ్యాస్ స్టవ్ తదితర సామాగ్రిని గంగారం తాజా మాజీ సర్పంచ్ తెప్పల దేవేందర్ రెడ్డి, నాయకులు తెప్పల ప్రభాకర్ రెడ్డి వితరణ చేశారు. మంథని ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెప్పల బ్రదర్స్ తెలిపారు. కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, సిఐ నాగార్జున రావు, తాజా మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య తదితరులు చేతుల మీదుగా పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు.