సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి 

సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి 

సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి 

– బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు

నిజామాబాద్, తెలంగాణ జ్యోతి  : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుక లు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా వక్తలు మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనం దంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్నగౌడ్ కనబర్చిన పోరాట తెగువ అందరికీ స్ఫూర్తిదా యకమని అన్నారు. ఆనాటి రాచరిక వ్యవస్థలోని దౌర్జన్యాలను ఎండగడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నులు లేని వ్యవస్థను నెలకొల్పి గొప్ప పరిపాలనను అందించారని కొనియాడారు. ఆ మహనీ యుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గీత కార్మికులు ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకు నేలా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, సి.గంగాధర్, గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ.సత్యనారాయణ గౌడ్, గౌడ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారయ్య గౌడ్, నాయకులు చెరకు లక్ష్మణ్ గౌడ్, రత్నాకర్ గౌడ్, తాళ్లపల్లి రాజా గౌడ్, సేపూరి సుమన్ గౌడ్, నాగరాజు గౌడ్ బండి సాయా గౌడ్ మాజీ కార్పొరేటర్ ఉమా శ్రీనివాస్ గౌడ్, అధిక సంఖ్యలో గీత వృత్తిదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment