బిజెపి ఎంపి టికెట్ ఆశిస్తున్న సంఘ్ నేత పోరిక క్రిష్ణమోహన్ సింగ్
– ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేస్తానంటున్న వైనం*
మానుకోట, తెలంగాణ జ్యోతి : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ బిజెపి టికెట్ కోసం ఆశా వాహులు ఎందరో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో సంఘ్ నేత పోరిక క్రిష్ణమోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడిగా, జేఏసీ నేతగా అనేక సేవలు అందించారు. తన రచనలు ఉప న్యాసాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఎంతగానో తోడ్పాటు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, విశ్వహిందూ పరిషత్ ప్రచారకుడిగా హిందుత్వంపై, జాతీయ వాదంపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసి గూడాలలో విద్యా వైద్యంపై విద్యార్థులకు అనేక సేవలు చేశారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలను ఎన్నో సేవలు చేశారు. అన్ని పార్టీలలో కూడా కృష్ణమోహన్ సింగ్ శిష్యులు, అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కృష్ణమోహన్ సింగ్ కు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారని అతని అభిమానులు శ్రేయో భిలాషులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలపై విస్తృత ప్రచారం చేసిన సౌమ్యులు, మృదుస్వభావి, బహుభాషనేత్త కృష్ణమోహన్ సింగ్ సేవలను బిజెపి అధినాయకత్వం గుర్తించి మహబూబాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా ప్రకటించాలని మహబూ బాబాద్ లోకసభ పరిధిలోని మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, డోర్నకల్, భద్రాచలం, పినపాక ప్రజలు బిజెపి పార్టీ హైకమాండ్ ను కోరుతున్నారు.