యూత్ కాంగ్రెస్ నేతలుగా సందీప్, మహేష్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చీమల సందీప్, కాటారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చీటూరి మహేష్ గౌడ్ విజయం సాధించారు. తమ పై నమ్మకంతో యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిపిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు లకు కృతజ్ఞతలు తెలిపా రు. తమ గెలుపునకు సహకరించి తమ అమూల్యమైన వోట్ వేసి తమని గెలిపించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు వారు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మంథని నియోజ కవర్గంలో, కాటారం మండలంలో యూత్ కాంగ్రెస్ నీ మరింత బలపరిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.