సనాతన ధర్మం కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తోంది
– శ్రీరాముని చరిత్ర అన్నదమ్ములు, తల్లిబిడ్డలు, భార్య భర్తల బంధం తెలుపుతుంది
– ప్రపంచ దేశాలకు భారతదేశం ప్రయోగశాల
– రాష్ట్రీయ సేవికా సమితి జిల్లా ప్రముఖ్ వాంకుడోతు జ్యోతి
– ములుగులో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో వైభవంగా రావణాసురవధ
– రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి కన్నయ్యలాల్
– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ములుగు ప్రతినిధి : వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశ సనాతన ధర్మంతో కుటుంబ వ్యవస్థ బలోపేతమవుతోందని, దేశ నలుదిక్కుల వ్యాపించిన రామాయణంలోని శ్రీరాముని చరిత్ర అన్నదమ్ములు, తల్లీబిడ్డలు, భార్యాభర్తల అనుబందా లను తెలియజేస్తోందని రాష్ర్టీయ సేవికా సమితి జిల్లా ప్రముఖ్, ఉపాధ్యాయురాలు వాంకుడోతు జ్యోతి అన్నారు.
ప్రపంచ దేశాలకు భారతదేశం ప్రయోగశాల అని, విదేశీ సంస్కృతితో విచ్ఛిన్నమ వుతున్న దేశాల్లో భారత సంస్కృతీ, సంప్రదాయాలు చుక్కానిగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగులోని సాధనా స్కూల్ సమీపంలో ధర్మజాగరణ సమితి ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన రావణాసురవధ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వాంకు డోతు జ్యోతితోపాటు ముఖ్య అతిథిగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్యలాల్ హాజరై రావణ బొమ్మకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త జ్యోతి మాట్లాడుతూ.. దేశ సంస్కృతిని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రపం చానికి ఆదర్శంగా నిలుస్తున్న దేశంలో పాశ్యాత్య సంస్కృతి ఆనవాళ్లతో నేరాలు పెరుగుతున్నాయన్నారు. హైందవ ధర్మం శాస్త్రీయతను మేలవించుకొని ఉంటుందని, ప్రతీ విషయంలో సైన్స్ కనిపిస్తుం దన్నారు. భారతదేశంలోని పంచభూతాల్లోనే ధర్మం విలసిల్లుతోందని, గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం మనిషి ఏవిధంగా జీవించాలో నేర్పుతా యన్నారు. తల్లి దండ్రులు ఆధునిక సమాజంలో పోటీ కోసం మూలాలను విస్మరించి కన్నబిడ్డలకు నేర్పకుండా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో వీరులు దేశం కోసం, ధర్మం కోసం, ఈ మట్టి కోసం తపించి త్యాగాలు చేసిన మూలాననే స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని స్పష్టం చేశారు. చంటి బిడ్డ కు ఏదైనా అయితే వైద్యులకు కూడా అంతుపట్టని రోగం కన్న తల్లి ప్రేమతో నయమవుతుందని కొనియాడారు. భారతీయ స్త్రీ అంటేనే మాతృత్వం మేళవించి ఉంటుందని, పురాణాల్లోని ఓ కథను వివరిస్తూ అన్నలో తండ్రిని, వదినలో తల్లిని చూసు కునే గొప్ప సంస్కృతిలో ఉన్నామన్నారు. రామాయణం, మహాభారతం, భాగవతాలను ప్రతీ ఒక్క విద్యార్థికి తెలిపితే భారతదేశంలో నేరం అనేదే జరుగదని జ్యోతి పేర్కొన్నారు. కాకిలోని ఆపదలో స్పందించే గుణాన్ని చూసి మనిషి నేర్చుకో వాల్సింది చాలా ఉందన్నారు. అదేవిధంగా మనిషి బాహ్య స్వరూపాన్ని బట్టి కాకుండా అంతరంగా ఉండే మంచి గుణాన్ని తెలుసుకోవాలన్నారు. మంచిపై చెడు సాధించిన విజయంగా జరుపుకునే దసరా ఉత్సవంలో పరస్త్రీ వ్యామో హంతో రావణుడు రాక్షసుడయ్యాడని, ఆ చరిత్ర ద్వారా మనిషి ఎంతో నేర్చుకొని వసుదైవ కుటుంబం కోసం కృషి చేయాలన్నారు. చెడు ఆలోచనలు ఉంటే ఖర్మానుసారం వెంటనే ప్రతిఫలం ఉంటుందన్నారు. యువత చేతుల్లోనే సమాజం అందంగా తీర్చిదిద్దుకోవచ్చని, ఒక్క తల్లి మాత్రమే అలాంటి మంచి భారత పుత్రులను తయారు చేయగలదని వ్యాఖ్యానించారు. అలాంటి తల్లుల శిక్షణలోనే శివాజీ మహ రాజ్, రాణాప్రతాప్, తదితర మహావీరులు చరిత్రలో నిలిచార న్నారు. సమాజంలో స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలని, చిన్ననాటి నుంచి పిల్లలకు నేర్పాలన్నారు. తల్లి, చెల్లి, భార్య, కూతురు ఇలా వారి మధ్య భేదాలను తెలియజేస్తూ సోదర భావంతో మెలిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా రెండు గంటలపాటు బాణాసంచా మోతలతో ములుగు పట్టణం శోభాయమానంగా వెలుగొందింది. మల్లెపందిరి, నాగుపాము బుసకొట్టుట, రావణాసుర వధతో కార్యక్రమం ముగిసింది.
ఈ సందర్భంగా ములుగు జిల్లాకు చెందిన బీట్ బాక్సర్ పొన్నం రాణా ప్రతాప్, బొమ్మతో మిమిక్రీ చేసిన ప్రతీక్, మ్యూజిక్ డైరెక్టర్ పూర్ణాచారి, రేలా విజయ్ పాటు, కూడిపూడి నృత్యా లు ఆటాపాటా భక్తులను అలరించాయి. అయితే భారీ వర్షం శనివారం సాయంత్రం రావణ వధకు అంతరాయం కలిగిం చగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సుమారు 20వేల మంది భక్తులు హాజరై వీక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్ రావు, శాశ్వత కమిటీ సభ్యులు బండారు రఘు, కన్నోజు సునీల్, కొండి రవీందర్, సముద్రాల రఘు, బాదం ప్రవీణ్, తిరుమల రవిందర్, కొత్తపల్లి బాబు రావు, సానికొమ్ము శ్రీనాథ్ రెడ్డి, సానికొమ్ము వినీత్ రెడ్డి, తుమ్మ పిచ్చిరెడ్డి, గండ్రత్ శ్రీధర్, ఇమ్మడి ఒదెలు, నగరపు రమేష్, కంబాల రవి, శీలం మధు, పెట్టెం రాజు, సల్లగొండ పద్మాకర్ రెడ్డి, పి.అనిల్, భూక్య జంపన్న, గంగిశెట్టి శ్రీనివాస్, మాదరి వంశీ, బీస రమేష్, గండ్రత్ శ్రీనివాస్, పైడిమల్ల రంజిత్ కుమార్, మాదం కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు చెలు మల్ల రాజేందర్, సుతారి సతీష్, గాదం దేవేందర్, అనుముల సురేష్, గందె రాజు, కొత్త సురేందర్, మాదరి జనార్ధన్, పాడ్య కుమార్, ఎల్కతుర్తి శ్రీహరి, పాడ్య చంటి, జర్పుల పవన్, మేడుదుల మమన్, బైకాని రాజశేఖర్, గుగ్గిళ్ల సుజన్, ముకులోతు శరత్, నేతావత్ సుధాకర్, గండ్రకోట విష్ణు కుమార్, సూర్యదేవర విశ్వనాథ్, చంద్రమౌళి, తమ్మిశెట్టి అరుణ్, నాగరాజు, భూక్య కళ్యాణ్, సుధీర్ రాథోడ్, ఉప్పుల వంశి, ప్రభు, 70మంది శాశ్వత, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.