అనారోగ్యంతో సమ్మక్క ప్రధాన పూజారి ముత్తయ్య మృతి 

అనారోగ్యంతో సమ్మక్క ప్రధాన పూజారి ముత్తయ్య మృతి 

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య (50) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడు తున్న ముత్తయ్య రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్న సమయం లో ఇంట్లోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముత్తయ్యకు కొడుకు, కుతురు ఉన్నారు. ప్రధాన పూజారి ముత్తయ్య మృతితో మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.