సంపన్నులకు సామాన్యులకు ఒకే రకమైన భోజనం
– భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : సంపన్నులకు సామాన్యులకు ఒకే రకమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మొదలుపెట్టారని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు అన్నారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో గురువారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు శంకుస్థాపనలను నిర్వహించారు. అనంతరం సన్న బియ్యం పథకాన్ని లాంచనంగా వాజేడు, వెంకటాపురం మండలాల్లో సన్న బియ్యం పథకాన్ని ములుగు అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ మహేందర్ జి, జిల్లా సివిల్ సప్లై అధికారి పైజల్ హుస్సేన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరు స్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని, అర్హులైన వారికి అందే విధంగా అధికారులు చర్యలు తీసు కోవాలని కోరారు. ప్రజా పాలన, సంక్షేమం, రైతు సంక్షేమంతో, పాటు రాజీవ్ యువ వికాసం ఇంకా ఇతర పథకాలతో ప్రజా పాలన ప్రజల వద్దకు చేరువ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం వెంకటాపురంలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి, ప్రజల నుండి అనేక సమ స్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వెంకటాపురం భద్రాచలం రహదారి మరమత్తులు చేయాలని ప్రముఖ న్యాయ వాది బాహుబలేంద్రుని నటరాజ పూర్ణచందర్రావు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతు పనులు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. అలాగే వెంకటాపురం చర్ల రహదారి లోని రాళ్లవాగు వంతెన మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసినట్లు త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంబాబు తో పాటు మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్ర ప్రసాద్, మండల పంచాయతీ అధికారి హనుమంతరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీరాములు రమేష్, మాజీ ఎంపిటిసిలు రవి, సీతాదేవి నాయకు లు పిల్లారి శెట్టి మురళి, లతోపాటు పలువురు నాయ కులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనలో వెంకటా పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కే. తిరుపతి రావు పోలీస్ సిబ్బంది తో బందోబస్తు నిర్వహించారు.