భాషా పండితులకు వేతన సవరణ చేయాలి
– భూపాలపల్లి జిల్లా భాషా పండితుల డిమాండ్
తెలంగాణ జ్యోతి, కాటారం : తెలంగాణలోని తెలుగు భాష పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం కల్పించా లని కోరుతూ రాష్ట్ర వేతన సవరణ కమిటీ (పీ ఆర్ సీ) చైర్మన్ కు జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం భాషా పండితులు ఆలోత్ ప్రతాప్ బృందం వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి తెలుగు, హిందీ, ఉర్దూ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రమ దోపిడీకి గురవుతూ, వెట్టి చాకిరి చేస్తూ మూడు దశాబ్దాలుగా సమాన పనికి సమాన హోదా,సమాన పనికి సమాన వేతనం అంటూ పోరాటం చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో భాషా పండితులు అందరూ స్కూల్ అసిస్టెంట్ లే అంటూ ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా హామీ ఇచ్చి, అమలు చేయలేకపోయినారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కోర్టు చిక్కుల వల్ల భాషా పండితులు ఇప్పటికీ పదోన్నతులను పొందలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యా యుల చిరకాల స్వప్నం పదోన్నతి కల్పించాలని, సుమారు 20 సంవత్స రాలు ఒకే కేడర్ లో పనిచేస్తున్న కూడా భాషా పండితులు. పదోన్నతికి నోచుకోలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం భాషా పండితులు ఆలోత్ ప్రతాప్ బృందం కోరింది.