చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సాయి ప్రకాష్ కు అవార్డులు ప్రధానం. 

Written by telangana jyothi

Published on:

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సాయి ప్రకాష్ కు అవార్డులు ప్రధానం. 

తెలంగాణ జ్యోతి, వెంకటాపురం నూగూరు : ప్రపంచ 20 వ రక్తదాన దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్ లోని సంస్కృతి రాజ్ భవన్ హాల్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తెలంగా ణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా చేయూత సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసిన సంస్థ వ్యవస్థాపకులు, విద్యా వంతులు యువకుడు చిడెం సాయి ప్రకాష్ కు ఉత్తమ సేవా కు రెండు అవార్డులను అందజేశారు. తెలంగాణ స్టేట్ రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా, రెడ్ క్రాస్ సెక్రెటరీ మధన్ మోహన్ ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఎక్కువ రక్తం దాన శిబిరాలు చేసిన సందర్భంగా వెంకటాపురం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థకు రెండు అవార్డులు రావడం జరిగింది.ఎక్కువ రక్తదాన శిబిరాలు పెట్టినందుకు గాను, ఎక్కువమందిని మోటివేట్ చేసి హైయెస్ట్ మోటివేషన్ అవార్డు, ఎక్కువ యూనిట్స్ ను భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీకి ఇప్పించి నందుకు గాను రెండు అవార్డులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , తెలంగాణ స్టేట్ రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా, రెడ్ క్రాస్ సెక్రెటరీ మదన్ మోహన్ చేతుల మీదుగా చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు చిడెం సాఇ ప్రకాశ్ కు అందజేశారు. అప్రిషియేట్ సర్టిఫికెట్స్ అందజేశారు.చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కు అవార్డుకు కారణమై సహకరించిన ప్రతీ ఒక్కరికీ, రక్తదాత లందరికీ పేరు పేరున అవార్డు గ్రహిత సాయి ప్రకాశ్ కృతజ్ఞతలుతెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల డైరెక్టర్లు చైర్మన్లు ఎమ్మెల్యేలు హెల్త్ డైరెక్టర్లు తెలంగాణ రెడ్ క్రాస్ సభ్యులందరూ పాల్గొన్నారు

Leave a comment