మహిళల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం

మహిళల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం

మహిళల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం

☆విద్యార్థులకు షీ టీం పనితీరుపై అవగాహన

☆బాలికలను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు

☆మహబూబాబాద్ షీ టీం ఎస్ఐ సునంద.

మహబూబాబాద్, తెలంగాణజ్యోతి: మహబూబాబాద్ పరిధి లోని అక్షర కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్  ఆదేశాల మేరకు షీ టీం ఎస్సై సునంద సమక్షంలో విద్యార్థినీ విద్యార్థులకు షీ టీం పనితీరు, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, గురించి అవగాహన కల్పించారు. కరుణాకర్ ఎస్ఐ ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా షీ టీం ఎస్సై షీ టీం ఎస్ఐ సునంద మాట్లాడుతూ బాలికలను ,మహిళలను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేదనకు గురి కాకూడదని విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేదనకు గురి కాకూడదని, మంచి ఆలోచనలతో చదువుకోవాలని సూచిం చారు. బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమని, చదువుకునే పాఠశా లలో కానీ బయట గాని ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసిన, వేధిం చిన, ఇబ్బందికరంగా మాట్లా డిన వెంటనే షీ టీమ్స్ నెంబర్ 8712656935 సమాచారం అందించాలని సూచించారు. ఇట్టి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, నిర్భయచట్టం, ఫోక్సో చట్టం, డయల్ 100 యొక్క ప్రాముఖ్యత, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 పై అవగాహన, మానవ అక్రమ రవాణా మద్యపాన నిషేధం మొదలగు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ కరస్పాం డెంట్ కం హెచ్ఎం బిజు పీటర్ సార్ మరియు అధ్యాపక సిబ్బం ది 160 మంది విద్యార్థిని విద్యార్థులు,షీ టీం సిబ్బంది అరుణ, పార్వతి, రమేష్, భరోసా సిబ్బంది జోష్ణ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సుప్రజ,  తదితరులు పాల్గొన్నారు.