సామూహిక వరలక్ష్మి వ్రతం

సామూహిక వరలక్ష్మి వ్రతం

సామూహిక వరలక్ష్మి వ్రతం

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రావణ శుక్రవారంను పురస్క రించుకొని శ్రీ శుభానంద అమ్మవారి ఆలయం వద్ద శ్రీ త్రిపురారి కృష్ణమూర్తి ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములతో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం (ఉచిత) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు మహిళలు పాల్గొని వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమం నిర్వహించుకొన్నారు. పూజలో పాల్గొన్న మహిళ భక్తులకు పూజా సామాగ్రి నైవేద్య ప్రసాదా లు దేవస్థానం తరఫున అందజేయడం జరిగినది. అనంతరం దేవస్థానం అర్చక స్వాములు మహిళలకు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల కు ఎలాంటి అసౌకర్యములు కలుగకుండా దేవస్థానం సూప రిండెంట్ బుర్రి శ్రీనివాస్, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.