ఎస్.ఎస్.సి. ఇంటర్ లో వందశాతం ఉతీర్ణత కోసం కృషి చేయాలి.
కాటారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలను ఆదివారం గిరిజన గురుకుల సంక్షేమశాఖ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏ.ఓ.) బి. శంకరయ్య సందర్శించారు. సందర్శనలో భాగంగా ఆయన కళాశాలలోని విద్యార్థులతో, అధ్యాపక, ఉపాధ్యాయలతో మరియు సిబ్బంది తో వేరు వేరు గా సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్ లో 100 శాతం ఫలితాలు సాధించేందుకు పక్కప్రణాళికతో విద్యార్థులని సంసిద్ధులని చేయాలని, ప్రతి విద్యార్థి అరవై శాతానికి పైగా మార్కులతో, ఉతీర్ణత సాధించేలా, మెరుగైనా ఫలితాలకి కృషి చేయాలని ఉపాధ్యాయులని కోరారు. దానికి అనుగుణంగా విద్యార్థులు.. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ, కష్టించి మంచి ఫలితాలు సాధించి, గురువుల మరియు తల్లిదండ్రులు శ్రమకి తగిన గుర్తింపు తేవాలని కోరారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జె.కె. బుచ్చయ్య మాట్లాడుతూ… గురుకులం సూచనల మరియు ఆదేశాల మేరకు, పక్కా ప్రణాళికతో… రాబోవు పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్ మరియు పదవ తరగతిలో 100 శాతం ఫలితాల కోసం శ్రమిస్తున్నామని, ఉత్తమ ఫలితాలు సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ హరిగొప్పుల రాజేందర్, ఉపాధ్యాయులు బి. రాజు, సిరిసిల్ల శ్రీనివాస్,జి. రాకేష్, సాయి లక్ష్మి, సంధ్యారాణి, స్వప్న, సంపత్, కృష్ణమాచారి, గోపాలకృష్ణ, సంతోష్, రాజేశ్వరస్వామి, సర్దార్ సింగ్, రామకృష్ణ, రాజయ్య, నరసింహ, పి.డి. మంతెన శ్రీనివాస్, ఏ.ఎన్. ఎం. ప్రీతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.