సెటిల్మెంట్ దందాలో ఎస్ ఆర్వో..!

సెటిల్మెంట్ దందాలో ఎస్ ఆర్వో..!

సెటిల్మెంట్ దందాలో ఎస్ ఆర్వో..!

– సొసైటీకి కాకుండా కాంట్రాక్టర్ కు క్వారీ దక్కడంలో కీలకపాత్ర

– సోషల్ మీడియాలో వీడియో వైరల్

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజల కోసం పని చేయాల్సిన అధికారి సెటిల్ మెంట్ దందా నిర్వహిస్తున్నాడు.. గిరిజనులకు ఇసుక క్వారీ కేటాయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారి అందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్ కు వంత పాడుతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిం ది. ములుగు జిల్లాలో టిజిఎండిసి విభాగంలో పని చేస్తున్న ఓ సైట్ రిసోర్స్ అధికారి వ్యవహారం తలనొప్పిగా మారింది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలో ఏటూరు సొసైటీ సభ్యు లకు దక్కాల్సిన క్వారీని ఓ కాంట్రాక్టర్ కు అప్ప గింతలో కీలకం గా సదరు అధికారి వ్యవహరించినట్లు తెలుస్తోం ది. స్వయంగా సభ్యులకు డబ్బులు పంపిణీ చేస్తూ సెటిల్మెంట్ కు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దావత్ ఏర్పాటు చేసిన అధికారి కాంట్రాక్టర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దనీ, మీకు కావాల్సిన మొత్తం డబ్బులు ఇప్పించే బాధ్యత తనదంటూ చేసిన వ్యాఖ్యలు గల వీడియో వాట్సాప్ గ్రూప్ ల్లో వైరల్ అవుతోంది. ఈ వ్యవహరమంతా కూడా సరిగ్గా వారం క్రితం జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్ళుగా ములుగు జిల్లా డీజీఎండిసి ప్రాజెక్టులో పని చేస్తున్న సదరు సైట్ రిసోర్స్ అధి కారి భాగోతం ఉన్నతాధికారులకు సైతం తెలిసిన సదరు అధికారిపై చర్యలు తీసుకోకుండా ఉండటం గమనార్హం…

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment