పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.
వరంగల్, తెలంగాణ జ్యోతి : హనుమకొండ నుండి ఏటూరు నాగారం వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపుతప్పి ఒగ్లాపూర్ సమీపంలోని పవర్ గ్రిడ్ వద్ద పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.