ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రయాణికులకు ఎర్రమట్టి బురద స్వాగతం

Written by telangana jyothi

Published on:

ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రయాణికులకు ఎర్రమట్టి బురద స్వాగతం

ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు – పట్టించుకోని ఆర్టీసీ అధికారులు 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురంలోని టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్లోకి ప్రయాణికులు వెళ్లాలంటేనే భయాంధో ళన చెందుతున్నారు. రాక పోకలు సాగించే బస్సులు కారణం గా వర్షాలతో ఎర్రమట్టి చిలికి బురదగా మారి బస్ స్టేషన్ లోకి ఇన్,అవుట్ గెట్ ఇంటర్నల్ రోడ్లు బురదమయంగా మారా యి. ప్రతినిత్యం భద్రాచలం, వరంగల్ టు డిపోలు కు చెందిన ఆర్టీసీ బస్సులు, ఎక్స్ప్రెస్ సర్వీసులు సుమారు 34 కు పైగా బస్సులు వెంకటాపురం బస్ స్టేషన్ నుఃడి రాక పోకలు సాగిస్తుంటాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్ స్టేషన్ నుండి రాకపోకలు సాగిస్తుంటారు. గోతులు కారణంగా ఎర్రమట్టి పోయడంతో, వర్షాలకు ఎర్ర మట్టి బురదగా మారి నడవడానికి కూడా వీలు లేకుండా దమ్ము చేసిన వరి పొలాలుగా మారాయి .బస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు, చిలికిన ఎర్రటి బురద పాదరక్షలు కు అంటుకొని దుస్తులపై పడుతుండటంతో పాటు, కొంతమంది చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు సైతం ఎర్ర మట్టి బురదలో జారి కిందపడి దుస్తులు నిండా సింధూరం రంగులో వున్న బురద అంటుకోవడంతో, ఆరోజు ప్రయాణం మానుకొని ఇళ్ళుకు వెళ్ళి దుస్తులు మార్చు కొని మరలా బస్ స్టాండు కు వస్తున్న రు.ఈలోగా వారు వెళ్ళవలసిన బస్సులు వెళ్ళీ పోతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి నెలకొని ఉండగా, భద్రాచలం టిఎస్ఆర్టిసి డిపో మేనేజర్ పరిధిలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పరిధిలో వున్న స్టేషన్ పర్యవేక్షణ లేక పోవటంతో, పాటు వెంకటాపురం బస్ స్టేషన్ ను పట్టించుకునే నాధుడు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ఆర్టిసీ అదికారులు స్పందించి ఎర్రమట్టి బురద నుండి విముక్తి కల్పించాలని ప్రయాణికులకు బస్ స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులతో పాటు మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. బస్ స్టేషన్ అసౌకర్యాల విషయం పై పలుమార్లు రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజాప్రతి నిధుల ధ్రుష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవటం లేదని, ప్రయాణి కులు శాపనార్ధాలు పెడుతూ నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు.

Leave a comment